కావలసినవి దోసకాయ - మీడియం సైజుది ఒకటి పచ్చిమిర్చి - 6 చింతపండు - కొద్దిగా ఉప్పు - తగినంత పసుపు - చిటికెడు ఇంగువ - చిటికెడు నూనె - రెండు టేబు...
దోసకాయ - మీడియం సైజుది ఒకటి
పచ్చిమిర్చి - 6
చింతపండు - కొద్దిగా
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
ఇంగువ - చిటికెడు
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - చిన్న కట్ట
తయారి
దోసకాయ చెక్కు తీసి, గింజలు వేరుచేసి, చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. మిక్సీలో పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కొన్ని దోసకాయముక్కలు వేసి కచ్చాపచ్చాగా చేయాలి. ఒక గిన్నెలో దోసకాయ ముక్కలు, మెత్తగా చేసిన దోసకాయల మిశ్రమం, పసుపు, ఇంగువ, నూనె వేసి బాగా కలిపి, అరగంట సేపు ఊరనివ్వాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి, వేడివేడి అన్నంలోకి సర్వ్ చేయాలి.
COMMENTS