E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
జడ్జి: ఏమ్మా! నువ్వు కూడా నీ భర్త వెంట దొంగతనాలు చేస్తున్నావా?
ఆమె: అవును ‘బాబయ్యా! ఈకాలంలో ఒక్కరి సంపాదన మీద ఇల్లు ఎలా గడుస్తుంది బాబయ్యా?



తల్లి: ఆ టింకూతో గొడవపడొద్దని ఎన్నిసార్లు చెప్పాను. కోపం వస్తే పది అంకెలు లెక్కపెట్టుకోమని చెప్పానుగా!
కొడుకు: కాని టింకూ వాళ్లమ్మ వాడిని ఐదంకెలే లెక్కపెట్టమందట!
ప్రతిసారీ నన్నుభదేస్తుంటే, ఈసారి నేను వన్, టు, త్రీలు మాత్రమే లెక్కపెట్టి నాలుగు తగిలించాను.


ఓ అల్లరి పిడుగుతో మాట్లాట...
‘‘నువ్వు పెద్దరతే ఏమవుతావు?’’
‘‘పెద్దవాడినవుతాను’’
‘‘అదికాదు, పెద్దయ్యాక ఏమవుతావని?’’
‘‘ఏమీ అవ్వను!’’
‘‘డాక్టరు అవుతావా?’’ ‘‘మా డాడీకి ఇంజినీరుని కావాలనుంది’’
‘‘ఓహో! అలా చెప్పు!’’               
‘‘కాని - మా అమ్మకి నేను డాక్టరవ్వాలని’’ ‘‘అయితే నీకు ఏమవ్వాలనిఉంది?’’
‘‘తాతయ్యని అవ్వాలని’’
‘‘అదేమిటి?’’
‘‘అప్పుడేగదా అంతా నా మాట వినేది. నేనేది కావాలనుకుంటే అది అవ్వనిచ్చేది.’’



‘‘సైన్సు మాస్టారు ఐదు రూపాయల నాణెం గ్లాసులోని ద్రావణంలో పడేసి ఇది దీంట్లో కరుగుతుందా? కరగదా? చెప్పండి! అని అడిగాడు.’’
‘‘కరగదు సార్!’’ స్టూడెంటు అన్నాడు.
‘‘కరెక్ట్! ఎలాగో - కారణం చెప్పు!’’
‘‘అది కరిగిపోయేటట్లరతే, మీరు ఏ పావలానో, అర్ధరూపాయినో వేస్తారు గాని, ఐదు రూపాయలు వేస్తారా?’’


‘‘నిమ్మకాయ ఎలా ఇస్తున్నా వోయ్?’’
‘‘రూపాయికి మూడండి!’’
‘‘అబ్బా! చాలా ఎక్కువ చెబుతు న్నావ్?’’
‘‘అయితే రెండే తీసుకోండి.’’





‘‘నువ్వు ఫీజు కింద ఇచ్చిన చెక్కు బ్యాంకు నుంచి తిరిగొచ్చింది’’ కోపం గా అన్నాడు డాక్టర్.
‘‘చిత్రంగా వుంది సార్! నా రోగం కూడా అంతే కదా!’’ అన్నాడు సుబ్బారావు.




మొదటివాడు: మా తమ్ముడు జలాంతర్గామిలో పనిచేసేవాడు. వాణ్ణి ఉద్యోగంలోంచి సస్పెండ్ చేశారు.
రెండోవాడు: దేనికి?
మొదటివాడు: వాడిది వేడి శరీరం. గాలి కావాల్సినప్పుడల్లా కిటికీలు తెరవడం వాడి అలవాటు.









‘‘నిద్రపట్టడం లేదా? రాత్రి పడుకోబోయేటప్పుడు ఓ టాబ్లాట్ వేసుకోండి!’’
‘‘నిద్రపట్టనిది రాత్రి కాదు డాక్టర్ గారూ! మద్యాహ్నం ఆఫీసులో.’’



తల్లితోపాటు ఎగ్జిబిషన్ కు వెళ్లిన ఐదేళ్ల కుర్రాడు తల్లినుండి విడిపోయి తప్పిపోయూడు.
ఇంతలో అటువైపు పోలీసు రావడం చూసి  దెర్యంగా
 ‘‘ఏమండీ! ఎవరైనా స్ర్తీ నేను వెంట లేకుండా ఇటువైపుగా వెళ్లడం గాని చూశారా?’’ అన్నాడు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
కావలసినవి
మినుములు: కప్పు, పెసలు: అరకప్పు, రాజ్మా: అరకప్పు, బొబ్బర్లు: అరకప్పు, జొన్నలు: అరకప్పు, సెనగలు: అరకప్పు, రాగులు: అరకప్పు, సజ్జలు: అరకప్పు, ఉప్పు: తగినంత, పెరుగు: లీటరు, పచ్చిమిర్చి, అల్లంముద్ద: 3 టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర తురుము: కప్పు, జీలకర్ర: టేబుల్‌స్పూను

తాలింపుకోసం:
మినప్పప్పు: టీస్పూను, పచ్చిసెనగపప్పు: టీస్పూను, ఎండుమిర్చి: 5, జీలకర్ర: టీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, ఆవాలు: టీస్పూను

తయారుచేసే విధానం :
బాణలిలో కొద్దిగా నూనె వేసి దినుసులన్నీ వేసి తాలింపు చేసి పెరుగులో కలపాలి. తరవాత ఉప్పు కూడా కలపాలి. మినుములు, పెసలు, సెనగలు, రాజ్మా, సజ్జలు, బొబ్బర్లు, జొన్నలు, రాగులు... అన్నీ ఆరుగంటలముందే నానబెట్టుకోవాలి. నానబెట్టిన నీళ్లను వంపేసి గారెల పిండిలా మెత్తగా గట్టిగా రుబ్బాలి. ఇందులో సరిపడా ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి ముద్ద, జీలకర్ర, కొత్తిమీర తురుము వేసి కలపాలి.
బాణలిలో నూనె పోసి కాగాక వడల్లా చేసి వేయించాలి. తీసిన వెంటనే పెరుగులో వేస్తే మల్టీగ్రెయిన్‌ దహీ వడలు రెడీ.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates


చిన్నమ్మి: పెళ్ళైన మూడు రోజులకే మీవారు ఎలా పోయారు చిన్నమ్మి?
పెద్దమ్మి : మొదటి రోజు కాళ్ళు నొప్పంటే పట్టాను, రెండో రోజు నడుమునొప్పి అంటే పట్టాను, మూడో రోజు గొంతు నొప్పి అంటే పట్టాను, అంతే ..........?
ఆఆఆఆఆ.....................


అప్పారావు :(సుబ్బారావుతో):
ఒరేయ్! "You are a fool" అంటే అర్థం చెప్పరా?
సుబ్బారావు :"నువ్వు ఒక వెధవవి" అని
అప్పారావు :అలా తిట్టవద్దురా సుబ్బారావు.
ఆఆఆ...................


సుబ్బులు : ఆ దొంగ మీ ఉంగరం, గడియారం, పర్స్  దోచుకొని వెళ్లిపోతుంటే అలా నోరు మూసుకొని ఎలా ఉన్నారండి? కనీసం అరిస్తే ఇరుగు పొరుగు ఎవరైనా వచ్చేవాళ్ళు కదా?
అప్పారావు : ఆ, నోరు తెరిస్తే లోపలున్న రెండు బంగారు పళ్ళు కూడా పీక్కు పోతాడని భయమేసిందే సుబ్బులు.
ఆఆఆఆఅ..........................



అప్పారావు : మా తాత చాలా తెలివిగలవాడని, పైగా చాలా ముఖాలు ఉండేవని మానాన్న చెబుతుంటారు.
సుబ్బారావు : అలాగా! నువ్వు చూశావా?
అప్పారావు : లేదు. "మీ తాత బహుముఖ ప్రజ్ఞాశాలిరా! అని మా నాన్న చెబుతుంటారు.
ఆఆఆఆఆఆఅ..................


బంటి : "నాన్నా! నేను ఎక్కువ తింటూ ఉంటానని అరుస్తూ ఉంటావుగా. మరి నాకు పోటిలో మొదటి బహుమతి వచ్చింది తెలుసా?
నాన్నా : మంచిది! ఇంతకీ ఏ పోటీలో?
బంటి : తిండి పోటీలో
ఆఆఆఆ............



భార్య: ఏవండీ పొద్దున్న పిల్లాడ్నిస్కూల్ కి బైక్ మీద దించలేదంట?
భర్త: దించుదామనుకున్నా. కాని, వీధి చివరిదాకా వెళ్ళి, పేపర్ కొనుక్కుని వచ్చేసరికి వాడు బస్ లో వెళ్ళిపోయాడు.



బాస్: ఆఫీసుకు మారీ ఇంత లేటుగానా రావడం...?
ఉద్యోగి:  మూడా బండ్ల ముచ్చటతో త్రిబుల్ థమాకా సార్. బండి మీద బయలు దేరి రాక టైరు బరస్ట్ అయింది. బస్సులో వద్దా మంటే చెకింగ్ అంటూ ఆపారు. ఆటో ఎక్కి రైట్ రైట్ అనగానే రాంగ్ రూట్ అంటూ పట్టు కున్నాడు పోలీసు. అందుకే...



డైరక్టర్: ఏమిటండి ప్రొడ్యూసర్ గారూ! మీతో పాటు ఈ భిక్షగాడ్ని పట్టుకొచ్చారు?
ప్రొడ్యూసర్: రైల్లో పాటలు పాడుకుంటుంటే చూశానండి. పాటకు ఐదు రూపాయలిస్తే మనం చెప్పిన ట్లు పాడేస్తాడట. మనది లోబడ్జెట్ కదా! ప్లే బ్యాక్ సింగర్గా పనికొస్తాడని..



 మా వారికి పిచ్చి కుక్క కరిచింది. మీరు వెంటనే రావాలి,’ అంది తాయారు కంగారుగా.
మీరేం గాభరా పడకండి. నేను వచ్చేదాకా మంచం మీదే పడుకోబెట్టండి,’అన్నాడు డాక్టర్.
ఛీ..ఛీ..పిచ్చి కుక్కని మంచం మీదెలా పడుకోబెడతాం,’ అంది తాయారు.



టి.వి కొందామంటే బైనాక్యులర్స్ కొందామాటరేంటి,’ చిరాగ్గా అన్నది భార్య.
బైనాక్యులర్స్ వుంటే మేడమీద నుంచి ఎదురింటి టి.వి చూడవచ్చు,’ చెప్పాడు భర్త.




 ఏమిట్రా హరి అంతలా జుట్టు పెంచుకుం టున్నావ్? మొక్కా ఏంటి?’ సందేహంతో అడిగాడు సురేంద్ర.
మొక్కా పాడా? మా ఆవిడ సవరం కుట్టించుకుంటుందట,’ తాపీగా చెప్పాడు.





 ఏరా రవీంద్ర! క్రమ శిక్షణ అంటే ఏమిట్రా?’
ఒక్కొక్కరిని శిక్షించడం సార్!




సుబ్బారావు: ఈ పెళ్ళి అనేదాన్ని ఎవడు కనిపెట్టాడో గాని, బతుకు నానాటికీ దుర్భరమైపోతోంది గురూ!
పాపారావు: దానికంత వర్రీ అవ్వడమెందుకూ! అన్ని విషయాల్లోనూ భార్య చెప్పినట్లే విని ఆమెకనుకూలంగా నడుచుకుంటే సరి. ఏ సమస్యలూ రావు!
సుబ్బారావు: నిజమే! కాని నేను ఏ భార్య చెప్పినట్లు వినాలి? పెద్ద భార్య చెప్పినట్లా? చిన్న భార్య చెప్పినట్లా?

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
నిత్యం యవ్వనంతో ఉండటం కంటే మరో వరం లేదు. ముఖ్యంగా వయసు తెలిసిపోయేది చర్మంతోనే. తెల్లబడే తలకు రంగు వేసైనా వృద్ధాప్యాన్ని కనిపించకుండా ఆపవచ్చేమో గాని, ముడుతలు పడే చర్మానికి ఏం చేసి వృద్ధాప్య లక్షణాలను ఆపగలం? చర్మంపై త్వరగా వృద్ధాప్య లక్షణాలు కనబడటానికి కారణాలు, వాటిని నివారించేందుకు తీసుకు వాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవాలనుకునే వారి కోసమే ఈ కథనం.
చర్మం మన దేహంలోని అతి పెద్ద అవయవం. సూర్యుడి హానికారక కిరణాలనుంచి, వాతావరణంలోని వేడిమి/చలి నుంచి, అనేక సూక్ష్మక్రిములనుంచి రక్షణ కల్పిస్తుంది చర్మం. అదే లేకపోతే ఏ జీవి మనుగడా సాధ్యం కాదు. ఇలా రక్షణ కల్పించే ప్రక్రియలో దానికి అయ్యే హానిని అదే తొలగించు కుని, దానికి అయ్యే గాయాలను అదే చక్కబరచుకుంటుంది. ఎప్పటికప్పుడు తనను తాను రిపేర్‌ చేసుకుంటుంది. అయితే కాలం గడుస్తున్న కొద్దీ చర్మంలో వయసు తాలూకు అనేక మార్పులు కనిపిస్తాయి. చర్మంపై కాల ప్రభావాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది అంతర్గతంగా వచ్చే మార్పుల (ఇంట్రిన్సిక్‌) తాలూకు కారణాలు, రెండోది బాహ్య కారణాలు (ఎక్స్‌‌రటిన్సిక్‌). వయసు పైబడటానికి అంతర్గత (ఇంట్రిన్సిక్‌) కారణాలు కాలం గడుస్తున్న కొద్దీ చర్మంలో వచ్చే మార్పులకు ప్రధాన కారణం జన్యువుల్లో ఉంటుంది. కొందరు... ముఫ్ఫైలలో ఉన్నా టీన్స్‌లో ఉన్నట్లే కనబడతారు. దానికి కారణం వారి జన్యువులే.
ఇలా అంతర్గత కారణాలతో జరిగే వయసు మార్పులను ‘స్వాభావిక వయసు మార్పులు’ (నేచురల్‌ ఏజింగ్‌) అంటారు. మన చర్మం బిగుతుగా ఉండటానికి కారణం... అందులో కొలాజెన్‌ అనే పదార్థం. ఈ కొలాజెనే చర్మం కణాలను పట్టి ఉంచినట్లుగా బిగుతుగా ఉంచడానికి సపోర్ట్‌ ఇస్తుంది. అయితే కాలం గడుస్తున్న కొద్దీ కొలాజెన్‌ ఉత్పత్తి మందగిస్తూ పోతుంటుంది. అలా మందగిస్తున్నకొద్దీ... చర్మాన్ని సాగదీసినప్పుడు మళ్లీ యథాస్థితికి వచ్చే గుణం (ఎలాస్టిసిటీ) తగ్గివదులుగా మారుతుంది. ఇక చర్మంపైన మృతకణాలు ఎప్పటికప్పుడు తొలగిపోయి, ఆ స్థానంలో మళ్లీ కొత్త కణాలు పుడుతుంటాయి. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ మృతకణాల స్థానాన్ని తీసుకునే కొత్త కణాల ఉత్పత్తి కూడా మందగిస్తుంటుంది. ఈ మార్పులన్నీ 20 తర్వాత నుంచి కనిపిస్తుంటాయి కాబట్టి ఏజింగ్‌ ఆ వయసు నుంచే మొదలవుతుంది.

వయసు పెరగడంతో వచ్చే స్వాభావిక మార్పులివి... 
  • చాలా సూక్ష్మమైన ముడుతలు (సాధారణంగా నుదు టిమీదపై ప్రస్ఫుటంగా కనిపిస్తాయి) 
  • చర్మం క్రమంగా పారదర్శకం కావడం 
  • చర్మం కింద ఉండే కొవ్వు క్రమంగా తగ్గిపోతుండటంతో చెంపల భాగంలో గుంటలు పడటం.
  • అలాగే కంటి చుట్టుపక్కల ఉన్న చర్మం కింది కొవ్వు కూడా తగ్గుతూ పోతుంది. అలాగే అరచేతుల వెనక భాగంలో,మెడ దగ్గర చర్మం వదులవుతూ ఉంటుంది 
  • కాలక్రమాంలో ఎముక కాస్తంత కురచగా మారడంతో ఎముక చుట్టూ ఉండే చర్మం వదులవుతుంది
  • పొడిగా ఉండే చర్మంలో దురదలు వస్తాయి. (అక్కడి గ్రంథుల సంఖ్యతగ్గడం వల్ల). 
  • స్వేదగ్రంథుల సంఖ్య తగ్గడంతో చెమటలు తగ్గి శరీరాన్ని చల్లబరిచే గుణం క్రమంగా తగ్గుతుంది.
  • శరీరంపై ఉండే వెంట్రుకలు క్రమంగా తెల్లబడతాయి. హార్మోనల్‌ మార్పుల వల్ల తలపై (మాడు భాగంలోని) వెంట్రుకలు క్రమంగా పలచబడతాయి. ఈ మార్పు స్ర్తీ, పురుషులిద్దరిలోనూ చోటుచేసుకుంటుంది 

ఇకస్ర్తీలలో అవాంఛనీయమైన వెంట్రుకల పెరుగుదల ఎక్కువ వుతుంది. (ఈస్ట్రోజెన్‌ తగ్గడం వల్ల)  గోళ్ల చివర అర్థచంద్రాకారంలో ఉండే తెల్లటి భాగం క్రమంగా మాయమై పోయి, గోళ్లపై చిన్న చిన్న గాట్ల వంటివి ఏర్పడుతుంటాయి. అయితే పై మార్పులు కొందరిలో ఇరవైలలో కాకుండా నలభైల్లోకి వచ్చే వరకూ ప్రారంభం కావు. ఇక కొందరిలో వయసు పెరగడం అనే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. దీనికీ జన్యువులే కారణం. ఈ కండిషన్‌ను ‘వీనర్స్‌ సిండ్రోమ్‌’ అంటారు ఈ సిండ్రోమ్‌తో బాధ పడేవారిలో వెంట్రుకలు టీనేజ్‌లోనే తెల్లబడతాయి. ముప్ఫయిలలో క్యాటరాక్ట్‌ వస్తుంది. 

వయసు పైబడటానికి బయటి కారణాలు (ఎక్స్‌ట్రిన్సిక్‌) 

వయసు పైబడినట్లుగా కనిపించడానికి అనేక  కారణాలు దోహదం చేస్తాయి. వాటిలో ముఖ్యమైనవి...

సూర్యుడికి ఎక్స్‌పోజ్‌ కావడం : సూర్యుడి కిరణాలకు ఎక్స్‌ పోజ్‌ కావడం వల్ల చర్మం కొన్ని మార్పులకు గురవుతుంది. కమిలినట్లుగా మారడం, ప్రెకిల్స్‌ (చిన్న చుక్కల్లా కనిపించే గోధుమ రంగు మచ్చలు), ఏజ్‌ స్పాట్స్‌, చర్మంపై సన్నటి ముడుతలు కనిపిస్తాయి. చర్మాన్ని సాగదీసినప్పుడు ఇవి మాయమౌతాయి. కొన్ని సందర్భాల్లో కాస్త ఎరగ్రా, గరుకుగా కనిపించే పులిపిరి కాయల్లాంటి యాక్టినిక్‌ కెరటోసిస్‌ వల్ల వయసు ఉన్నదాని కంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది తర్వాతి దశలో చర్మ క్యాన్సర్‌కూ దారితీయవచ్చు సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్‌ కావడం వల్ల వయసు పైబడినట్లుగా మారడాన్ని ‘ఫొటో ఏజింగ్‌’ అంటారు. ఒకరి చర్మం ఫొటో ఏజింగ్‌కు గురికావడం అన్నది మళ్లీ ఆ వ్యక్తి చర్మపు రంగుతో పాటు అతడు ఎంతసేపు ఎండవేడికి ఎక్స్‌పోజ్‌ అవుతున్నాడనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఫెయిర్‌గా (తెల్లటి/ఎరట్రి చర్మపు రంగుతో) ఉండేవారికి చర్మంలో మెలనిన్‌ అనే పదార్థం తక్కువగా ఉంటుంది. అందుకే వీళ్లు సూర్యరశ్మి ప్రభావానికి ఎక్కువగా గురవుతుంటారు. ఇక చర్మం డార్క్‌గా మారుతున్న కొద్దీ పై దుష్ర్పభావాలు తగ్గుతాయి. సూర్యరశ్మి తాలూకు దుష్ర్పభావాలకు చర్మం గురికావడం అన్నది కాలక్రమేణా జరుగుతుంటుంది. దీనివల్ల చర్మం నల్ల బడటం, మందంగా మారడం, ముడుతలు పడటం జరుగుతుంది. అదేపనిగా సూర్యుడికి ఎక్స్‌పోజ్‌ కావడం వల్ల పై మార్పులన్నీ శాశ్వతం అయ్యే అవకాశమూ ఉంది. అందుకే వేడి ప్రదేశాల్లో నివసించేవారిలో ఏజింగ్‌ మార్పులన్నీ వారి ఇరవైలలోనే కనిపించడం మొదలవుతుంది.


సూర్యరశ్మివల్ల కలిగే ఏజింగ్‌ ప్రక్రియ నివారణకు...

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
మానసిక ఒత్తిడి వల్ల కలిగే శారీరకంగానూ సమస్యలు ఎదురవుతాయని గుర్తించినప్పుడు చేయాల్సిందల్లా దాన్ని అధిగమించడం, నియంత్రిం చడం. దీనివల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని తేలింది కూడా. ఉదాహ రణకు మొదటిసారి గుండెపోటుకు గురైనవారు, ఒత్తిడిని సమర్థంగా నియంత్రించుకోగలిగితే 74 శాతం మందిలో రెండో స్ట్రోక్ రాకుండా నివారిం చుకోగలగడం సాధ్యమేనని తేలింది. పైగా ఇలా ఒత్తిడి నియంత్రణ కారణంగా వ్యాధి నిరోధకశక్తి కూడా పెరిగి అది కూడా జబ్బులను దూరం చేస్తుందని నిరూపితమైంది. ఒత్తిడిని అధిగమించడానికి మార్గాలివి...

  • ఒత్తిడికి కారణాన్ని గుర్తించి, దాని నుంచి దూరంగా ఉండాలి. దాంతోపాటు ఒత్తిడిని దూరం చేసుకోడానికి మరికొన్ని ప్రత్యామ్నాయ మార్గాలివి... ? చాలా లోతుగా గాలి పీల్చడం వంటి బ్రీతింగ్ వ్యాయా మాలు చేయడం ? ఏదైనా అంశం తీవ్రంగా బాధపెడుతుండటం లేదా పదే పదే గుర్తుకొస్తూ పశ్చాత్తాపానికి గురిచేస్తుంటే మరింకేదైనా వ్యాపకంలో పడుతూ దాన్ని మరచిపోయి, ఒత్తిడి నుంచి విముక్తం కావడం. 
  • ఒత్తిడికి గురయ్యే క్షణాల్లో చిక్కుకున్నప్పుడు అది తప్పని పరిస్థితి అని, దాని కార ణంగా ఒత్తిడికి గురవుతూ అంతర్మధనానికి లోనుకోవడం కంటే... అది తప్పించుకోలేని పరిస్థితి కాబట్టి, ఆ పరిస్థితుల్లో ఎవరున్నా చేయగలిగింది ఉండదని, కాబట్టి ఆ స్థితిని యథాతథంగా స్వీకరించడం మంచిదని సర్దిచె ప్పుకోవడం 
  • పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూడటం, సమస్యల ను అధిగమించాల్సిన కోణంలో పరిశీలించడం వంటి కొన్ని మార్గాల ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు.ఏ శారీరక లక్షణాల ద్వారా ఒత్తిడి ఉన్నట్లు గుర్తించవచ్చు.
కొన్నిసార్లు తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ మనకు అది తెలియకపోవచ్చు. కానీ కొన్ని శారీరక లక్షణాలు సైతం ఒత్తిడిని గుర్తించేలా చేస్తాయి. అవి...


1. నిద్రపట్టకపోవడం 
2. ఆకలి లేకపోవడం 
3. కండరాలు బిగుతుగా పట్టేయడం. 
4.మాటిమాటికీ తలనొప్పి 
5. జీర్ణకోశ సమస్యలు
6. దీర్ఘ కాలంగా దిగులు, బాధ లాంటివి ఉండి ఎంతకూ తగ్గకపోవడం. 

ఇవి కనిపిస్తున్నప్పుడు ఆ శారీరకబాధలు చిన్నవే కదా అంటూ నిర్లక్ష్యం చేయకూడదు. వీలైనంత త్వరగా డాక్టర్ను సంప్రదించి మానసిక ఒత్తిడి, శారీరక సమస్యలకు దారితీయకముందే జాగ్రత్తపడాలి.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ఒత్తిడి అనేది కేవలం మనల్ని ఇబ్బంది పెట్టే ఆ సమయంలోని మానసిక స్థితి మాత్రమే కాదు. దానివల్ల కొన్ని శారీరకమైన మార్పులూ వస్తాయి. ఫలితంగా శరీరం దెబ్బతింటుంది. అది ఎన్ని రకాలుగా జరుగుతుందో చూద్దాం.
ఒత్తిడి కారణంగా వచ్చే పది పాపులర్ సమస్యలు :
1. గుండెజబ్బులు: పైన పేర్కొన్నట్లుగా ఒత్తిడికి గురయ్యేవారిలో దీర్ఘ కాలిక గుండెజబ్బులు ఎక్కువగా ఉండటం చాలా సాధారణమైన విషయం. ఒక్కోసారి ఒత్తిడి గుండెపోటుకు దారితీస్తుందన్న విషయం తెలిసిందే.
2. ఆస్తమా: ఒత్తిడి ఆస్తమాను ప్రేరేపిస్తుందని ఇప్పటికే వైజ్ఞానిక శాస్తపరంగా రుజువైంది. అంతేకాదు... తల్లిదండ్రుల ఒత్తిడి పిల్లలకూ హాని చేస్తుందని తేలింది. ఒకవేళ తల్లిదండ్రులు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారే అయితే వారి పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశాలు చాలాఎక్కువని అధ్యయనాల్లో తేలింది. అంటే... తమ
ఒత్తిడి వల్ల వారు తమనే కాకుండా తమ సంతతిని, ముందు తరాలవారినీ బాధిస్తున్నారన్నమాట. గర్భవ
తిగా ఉన్నవారిలో కొందరిని ఎంపిక చేసుకుని ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. వారిలో సగం మందిని ఒత్తిడికి, మరో సగం మందిని కాలుష్యపు పొగకు ఎక్స్పోజ్ అయ్యేలా చేశారు. ఈ అధ్యయన ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. నిజానికి కాలుష్యపు పొగకు గురైన గర్భిణులకు పుట్టిన వారి కంటే... ఒత్తిడికి గురైన గర్భవతులకు పుట్టిన పిల్లల్లో అత్యధికులకు ఆస్తమా సోకింది. 
3. స్థూలకాయం: మన శరీరంలో కొవ్వు పేరుకునే ప్రాంతాల్లో... తొడలు, పృష్టభాగం కంటే పొట్టలో పేరుకునే కొవ్వు వల్ల తీవ్రమైన హాని కలుగుతుంది. కానీ ఒత్తిడి వల్ల పొట్టభాగంలో కొవ్వు పేరుకోవడం ఎక్కువగా జరుగుతుంది. తద్వారా ఆరోగ్య హాని కూడా ఎక్కువేనన్నమాట. అంటే ఒత్తిడి వల్ల రెండు రకాల నష్టాలని గుర్తించాలి. మొదటిది పొట్ట రావడం, రెండోది ఆ పొట్ట వల్ల ఆరోగ్యభంగం జరగడం.
4. డయాబెటిస్: తీవ్రమైన మానసిక ఒత్తిడి... డయాబెటిస్కు దారితీస్తుందన్న విషయం తెలిసిందే. మళ్లీ ఇది రెండురకాలుగా బాధిస్తుంది. డయాబెటిస్ కారణంగా ఆకలి పెరిగి... మనం తినకూడని అనారోగ్యకరమైన పదార్ధలైన వేపుళ్లు, బేకరీ పదార్థాలు తినేలా చేస్తుంది. ఇవి తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ పాళ్లు పెరగడం కారణంగా మనం అనారోగ్యానికి గురవుతాం. ఇలా ఒక అనారోగ్యం మరో ప్రతికూలతకూ, ఆ ప్రతికూలత మరో అనారోగ్యానికీ ఒక చక్రంగా సాగిపోతూ అనారోగ్యపు ఊబిలోకి దించుతూపోతుంది.
5. తలనొప్పి: ఒత్తిడివల్ల కొన్ని తలనొప్పులూ, మైగ్రేన్ రావడం సహజం. వాటి కోసం వాడే నొప్పి నివారణ మందులతో కొన్ని దుష్ఫలితాలు రావడం సాధారణం. వాటితో మరింత అనారోగ్యం కలగడం మరింత సర్వసా ధారణం. ఇలా ఒకటికొకటి తోడవుతూ ఆరోగ్యాన్ని మరింతగా దెబ్బతీయడం అన్నది ఒత్తిడి తాలూకు మరో చెడు లక్షణం.
6. డిప్రెషన్, యాంగ్జైటీ: ఒత్తిడికి గురైన వారుఉద్వేగాలకు లోనవుతుంటారు. ఇలాంటివారిలో యాంగ్జైటీ కనిపించడం మామూలే. ఇలా దీర్ఘకా లిక భావోద్వేగాలకు గురయ్యేవారిలో 80 శాతం మంది ఒత్తిడులకు లోనవుతుంటారు. వీరిలో చాలామంది కొంతకాలం తర్వాత తీవ్ర నిరాశ, నిస్పృహలకూ దీర్ఘకాలంలో డిప్రెషన్కు లోనైన దాఖలాలు చాలా ఉన్నాయి.
7. జీర్ణకోశ సమస్యలు: ఒత్తిడికి గురయ్యేవారిలో చాలామంది జీర్ణకోశ సమస్యలకు గురవుతుండటం సాధారణం. వీరిలో చాలామందికి ఒత్తిడికి గురికాగానే కడుపులో యాసిడ్స్ స్రవించి మంట రావడం, అలా మంటలు వచ్చే వారిలో చాలామందికి దీర్ఘకాలంలో కడుపులో అల్సర్స్ కనిపిస్తాయి. ఇలా గ్యాస్ పైకి తన్నేవారికి ఛాతీలో నొప్పి రావడం చాలా సాధారణంగా కని పించే పరిణామం. ఆ సంకేతాన్ని కొన్నిసార్లు గుండెపోటుగా పొరబడటమూ చాలామందిలో చూస్తుంటాం. ఇలా దీర్ఘకాలం గ్యాస్ పైకి ఎగదన్నుతుండేవారు గ్యాస్ట్రిక్ ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) అనే శారీరక రుగ్మతకూ లోనవుతుంటారు. ఈ దుష్పరిణామాలన్నీ ఒత్తిడి కారణంగానే జరుగుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి.
8. అల్జైమర్స్ డిసీజ్: ఒత్తిడి కారణంగా మెదడులో కలిగే గాయాలు తీవ్రమై అల్జైమర్స్ డిసీజ్కు దారితీస్తుందని కొన్ని అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. పైగా ఒత్తిడి వల్ల అల్జైమర్స్ డిసీజ్ తీవ్రం కావడం చాలా
వేగంగా జరుగుతుంది. అంటే ఒత్తిడి లేనివారిలో అల్జైమర్స్ డిసీజ్ కాస్త ఆలస్యమైతే... ఒత్తిడి వల్ల అది రావాల్సిన సమయం కంటే ముందుగా వచ్చే అవకాశాలూ ఉన్నాయని గుర్తించాలి. పైగా ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ అది తీవ్రమయ్యే వేగం కూడా పెరుగుతుందని గ్రహించాలి.
9. వేగంగా వయసు పైబడటం: ఒత్తిడి వల్ల త్వరగా వృద్ధులైపోయే మరో దుష్పరిణామం కనబడుతోంది. తల్లుల, పిల్లల డీఎన్ఏలను పరిశీలిస్తూ జరిగిన ఒక అధ్యయనంలో ఈ ఫలితాలు స్పష్టమయ్యాయి. ఒత్తిడికి గురైనవారు, తమ తల్లులతో పోలిస్తే వేగంగా వృద్ధాప్య దశకు సమీపించి నట్లు, వారిలో వృద్ధాప్యలక్షణాలు చాలా త్వరగా కనిపించినట్లుగా అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. అంటే... ఒకరు ఆ వయసుకు కనబరచాల్సిన లక్షణాలను 9 నుంచి 17 ఏళ్ల ముందుగానే కనబరుస్తున్నట్లు ఆ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
10. చాలా ముందుగా మరణించడం (ప్రీ-మెచ్యుర్ డెత్) : ఒకరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారిలో మరణం ఎప్పుడు సంభవించవచ్చో కొంతమేరకు అంచనా వేయడం మామూలే. అయితే కొందరిలో మరణించాల్సిన వయసు
కంటే ముందే మరణించడం జరుగుతుంది. అప్పుడు చాలా త్వరగా పోయా రంటూ బాధపడటం మామూలే. ఒత్తిడితో ఇలాంటి మృతులు సంభవించడా న్ని అధ్యయనవేత్తలు చాలా దృష్టాంతాలలో పరిశీలించారు. తీవ్రమైన దీర్ఘ కాలిక ఒత్తిడికి లోనయ్యేవారిలో మరణం చాలా ముందుగా వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
‘ఒత్తిడి అలా కొనసాగుతూ ... అది ఎలాంటి హానీ చేయకపోతే దాన్ని ఎంతకాలమైనా భరించ గలం’ అనుకునే వాళ్లూ ఉన్నారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఒత్తిడి అన్నది కేవలం ఆ సమయానికే పరిమితం కాదు. ఒత్తిడి అప్పటికి తొలగినా... దాని భవిష్యత్ పరిణామాలు మాత్రం వేరుగా ఉంటాయి. దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉండే ఒత్తిడి అలా అలా వేర్వేరు వ్యాధులకు దారితీస్తుంది. అదీ నిజమైన సమస్య. అందుకే ఏరోజుకు కలిగే ఒత్తిడిని ఆ రోజుకు అలా భరిద్దాంలే అనుకుంటే కుదరదు. అదలా దీర్ఘకాలం పాటు కొనసాగుతూ పోతూ ఉంటే, దాని వల్ల వచ్చే వేర్వేరు వ్యాధులు... అందు వల్లదాన్ని నివారించుకోవాల్సిన ఆవశ్యకత గురించిన అవగాహన కోసం... ఈ కథనం. 

వ్యాధి నిరోధక శక్తిపై ఒత్తిడి ప్రభావం... 
మనకు ఏదైనా గాయం అయినప్పుడు అక్కడ వాపు రావడం, ఎరబ్రారడం (ఇన్ఫ్లమేషన్) వంటి పరిణామాలు జరుగుతాయి. ఇది బాధాకరంగానే ఉన్నా, కాస్త వ్యవధి తర్వాత ఆ ఎరుపూ, మంటా, వాపు వంటివి దానంతట అదే తగ్గడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ను నివారించే శక్తిని మన శరీరం కోల్పోతుంది. ఈ విషయం కార్నెగీ మెలాన్ యూనివర్సిటీకి చెందిన షెల్డన్ కోహెన్ అనే అధ్యయనవేత్త ఆధ్వర్యంలో జరిగిన అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అధ్యయన ఫలితాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ తాలూకు మార్గదర్శ కాల్లో చోటుచేసుకున్నాయి కూడా. ఒత్తిడి అన్నది శరీరంపై ఎలా దుష్ర్పభావం చూపుతుందన్న విషయం మొదటిసారిగా స్పష్టమైన తార్కాణాలతో వెల్లడైంది. నిజానికి మనలో ఇన్ఫ్లమేషన్ కలిగిన ప్పుడు కార్టిజోల్ అనే హార్మోన్ విడుదలై, అది వ్యాధి నిరోధక అంశాలను ప్రేరేపిస్తుంది. దాంతో ఆ వ్యాధి నిరోధకతను కలిగించే అంశాలు ఇన్ఫ్లమేషన్ను నియంత్రిస్తాయి. కానీ దీర్ఘకాలపు ఒత్తిడి కారణంగా కార్టిజోల్ అన్న హార్మోన్ స్రవించినా అది సరిగా పనిచేయదు. దాంతో ఒత్తిడి కారణంగా వ్యాధి నిరోధక అంశాలు కార్టిజోల్ వల్ల సరిగా ప్రేరణ చెందవు. ఫలితంగా ఇన్ఫ్లమేషన్ తగ్గదు. అంతే కాదు... ఈ థియరీ మరికొన్ని దృష్టాంతాల ద్వారా కూడా వాస్తవమని తేలింది. సాధారణంగా మనకు జలుబు చేస్తే, ఒకటి రెండు రోజుల తర్వాత దానంతట అదే తగ్గుతుంది. కానీ దీర్ఘకాలం పాటు ఒత్తిడికి గురయ్యే వారిలో జలుబు తగ్గడానికి చాలాకాలం తీసుకుంటుంది. కారణం... ఒత్తిడి ప్రభావం మన వ్యాధినిరోధక అంశాలపై ప్రతికూలంగా పడటమే. ఇలా మానసికమైన ఒత్తిడి కేవలం మానసికంగానే బాధించకుండా క్రమంగా అది శారీరక బాధలైన స్థూల కాయం, గుండెజబ్బులు, అల్జైమర్స్ వ్యాధులు, డయాబెటిస్, డిప్రెషన్, జీర్ణకోశ సమస్యలు, ఆస్తమా వంటి వాటికి దారితీస్తుందని స్పష్టంగా గుర్తించారు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
మగవాళ్లు ఎందుకు అబద్ధాలు చెబుతారు? సాహసాలు చేయటానికి ముందుకెందుకు దూకుతారు? భావోద్వేగాలను వ్యక్తం చేయకుండా లోపలే ఎందుకు దాచుకుంటారు? వీటన్నింటికీ టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ ప్రభావమే కారణమని చెబుతున్నారు అమెరికా సైకియాట్రిస్ట్‌లు. వారు ఆడవారు, మగవారి ఆలోచనలు, ప్రవర్తనలకు గల తేడాలను విశ్లేషించారు. అందుకు కారణమవుతున్న అంశాలనూ వివరించారు.  అందులో కొన్ని విషయాలు మీ కోసం..


  • గర్భంలో ఉండగానే ఎనిమిదో వారం నుంచే మగశిశువు మెదడుపై టెస్టోస్టీరాన్‌ ప్రభావం పడుతోంది. దీంతోనే అబద్ధాలు ఆడటం, సాహసం చేయటం, భావోద్వేగాలను అణచుకోవటం వంటి లక్షణాలకు బీజం పడుతోంది.
  • యుక్తవయసులో మగపిల్లలు ఇతరులను ఎక్కువగా విమర్శిస్తుంటారు. అన్నింటి పైనా త్వరగా ఆసక్తి కోల్పోతుంటారు. మెదడును టెస్టోస్టీరాన్‌ ఎక్కువగా ప్రభావితం చేయటం వల్ల.. అసాధారణమైన భావోద్వేగాలు మాత్రమే వారిని ఉత్తేజితం చేయగలుగుతాయి. అందుకే ఉద్వేగభరితమైన వీడియోగేమ్‌లను ఆడేందుకు మగపిల్లలు ఇష్టపడుతుంటారు.
  • సంభోగానంతరం ఆనందాన్ని కలగజేసే ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ హైపోథాలమస్‌లోకి విడుదల అవుతుంది. దీని ప్రభావంతో ఆడవాళ్లు తమ భాగస్వాములను హత్తుకోవాలని, మాట్లాడాలని భావిస్తుంటే.. మగవారిలో ఇది నిద్ర మాత్రలా పనిచేసి మగతను కలిగిస్తుంది. అందుకే వారు శృంగారంలో పాల్గొన్న తర్వాత వెంటనే నిద్రపోతుంటారు.
  • ఎవరైనా ఏదైనా సమస్యను మగవారికి చెప్పగానే సానుభూతికి బదులు ఏదో ఒక పరిష్కారాన్నే సూచిస్తుంటారు. మెదడులోని టెంపోరల్‌ పార్షల్‌ జంక్షన్‌ వ్యవస్థ చురుగ్గా పనిచేసి విశ్లేషణకు పురికొల్పటమే ఇందుకు కారణమవుతోంది. ఆ సమయంలో ఈ జంక్షన్‌. భావోద్వేగాలను రేకెత్తించే భాగంపై ఆధిపత్యం చెలాయిస్తుంది.
  • అయితే ఆడవారిలో ఇందుకు వ్యతిరేకంగా జరుగుతుంది. అందుకే స్త్రీలు పరిష్కారాలను సూచించే తార్కికత కంటే భావోద్వేగాలకే ఎక్కువ లోనవుతుంటారు.
  • కాబోయే తండ్రుల్లో టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ స్థాయి పెరుగుతుంది. అదే సమయంలో ప్రోలాక్టిన్‌ హార్మోన్‌ స్థాయి పడిపోతుంది. కాబోయే తల్లుల చర్మం నుంచి విడుదలయ్యే ఫెర్మోన్స్‌కు ప్రతిస్పందించటం వల్లే ఇలా జరగుతుండొచ్చు. ఇదే సమయంలో మెదడులో శబ్దాలను వినే భాగం మరింత చురుకుగా మారుతుంది.
  • అందువల్లే పిల్లల ఏడ్పును త్వరగా వినగలుగుతారు. పిల్లలు పుట్టే సమయానికి వారిని కనిపెట్టుకొని ఉండటంలో మగవారు ప్రధాన బాధ్యత తీసుకునే స్థాయికి చేరుకుంటారు.