భర్త (భార్యతో): నా అభిమాన హీరో సినిమాలన్నీ నేను మూడేసి సార్లు చూస్తుంటాను తెలుసా?
భార్య : ఆశ్చర్యమేముంది, మీకు ఏది ఒకసారి చెపితే అర్థం కాదుగా !

<><><><><><><><><><><><><><><><><><><><><><>

హరి (రైల్వే స్టేషన్ లో నిలబడి, అధికారిని ఈ విధముగా అడుగుతున్నాడు)
హైదారాబాద్ నుండి విశాఖపట్టణం ప్రయాణం ఎంత సేపండి?
అధికారి : ఒక సెకను సర్!
హరి : అంత త్వరగా వెళతామా............?

<><><><><><><><><><><><><><><><><><><><><><>

కనకారావు: తాయరమ్మతో, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, మాఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు..........
తాయారమ్మ: ఎవరు ?
కనకారావు : మా ఆవిడా, పిల్లలు

<><><><><><><><><><><><><><><><><><><><><><>

చింటూ(బంటి తో): చీమలను చూసి మనం ఏం నేర్చుకోవాలి రా?
బంటి : తీపి తినడం.

<><><><><><><><><><><><><><><><><><><><><><><><><><>

తాయారమ్మ(బంగారయ్యతో): భర్త సుఖముగా ఉండాలంటే భార్య ఏ నోము చేస్తే మంచిది?
బంగారయ్య : మూగనోము!
ఆఆఆఆఅ...............

<><><><><><><><><><><><><><><><><><><><><><><><><><>

చిన్నమ్మి: పెళ్ళైన మూడు రోజులకే మీవారు ఎలా పోయారు చిన్నమ్మి?
పెద్దమ్మి : మొదటి రోజు కాళ్ళు నొప్పంటే పట్టాను, రెండో రోజు నడుమునొప్పి అంటే పట్టాను, మూడో రోజు గొంతు నొప్పి అంటే పట్టాను, అంతే ..........?
ఆఆఆఆఆ.....................

<><><><><><><><><><><><><><><><><><><><><><><><><><>

అప్పారావు :(సుబ్బారావుతో):ఒరేయ్! "You are a fool" అంటే అర్థం చెప్పరా?
సుబ్బారావు :"నువ్వు ఒక వెధవవి" అని
అప్పారావు :అలా తిట్టవద్దురా సుబ్బారావు.
ఆఆఆ...................

 <><><><><><><><><><><><><><><><><><><><><><><><><><>

సుబ్బులు : ఆ దొంగ మీ ఉంగరం, గడియారం, పర్స్  దోచుకొని వెళ్లిపోతుంటే అలా నోరు మూసుకొని ఎలా ఉన్నారండి? కనీసం అరిస్తే ఇరుగు పొరుగు ఎవరైనా వచ్చేవాళ్ళు కదా?
అప్పారావు : ఆ, నోరు తెరిస్తే లోపలున్న రెండు బంగారు పళ్ళు కూడా పీక్కు పోతాడని భయమేసిందే సుబ్బులు.
ఆఆఆఆఅ..........................

<><><><><><><><><><><><><><><><><><><><><><><><><><>

అప్పారావు : మా తాత చాలా తెలివిగలవాడని, పైగా చాలా ముఖాలు ఉండేవని మానాన్న చెబుతుంటారు.
సుబ్బారావు : అలాగా! నువ్వు చూశావా?
అప్పారావు : లేదు. "మీ తాత బహుముఖ ప్రజ్ఞాశాలిరా! అని మా నాన్న చెబుతుంటారు.
ఆఆఆఆఆఆఅ..................

<><><><><><><><><><><><><><><><><><><><><><><><><><>

బంటి : "నాన్నా! నేను ఎక్కువ తింటూ ఉంటానని అరుస్తూ ఉంటావుగా. మరి నాకు పోటిలో మొదటి బహుమతి వచ్చింది తెలుసా?
నాన్నా : మంచిది! ఇంతకీ ఏ పోటీలో?
బంటి : తిండి పోటీలో
ఆఆఆఆ............

<><><><><><><><><><><><><><><><><><><><><><><><><><>

అప్పారావు : పొద్దున ఒకడు గాడిదను కొడుతుంటే వారించి ఆపా, దీన్నేమంటారు సుబ్బారావు?
సుబ్బారావు : సోదరప్రేమ!
ఆఆఆఆఆ...................

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: