పని వేళలు గంటల కొద్దీ సాగుతుంటే మతిమరుపు సమస్యలు తలత్తే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘ పని గంటలతో తీవ్రమైన బడలిక, టెన్షన్ మెదడుకు చేటు చేస్తాయని తేల్చరు.
పొగతాగడం వల్ల మెదడుకు కలిగే హాని స్థాయిలో దీని ప్రభావమూ ఉంటుందని గుర్తించారు. మధ్య వయసు ఉద్యోగుల్లో వారానికి 55 గంటలకన్నా ఎక్కువ సేపు పనిచేస్తే మానసిక సామర్థ్యం కుంటుపడే అవకాశాలు ఎక్కువ. పదాల్ని గుర్తుంచుకోవడం, కొద్ది సేపట్లోనే అన్నీ మరచిపోవడం వంటి సమస్యలు అధికమని వెల్లడైంది. వారానికి 41 గంటల కన్నా తక్కువ పనిచేసే వారిలో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవ్వడం లేదని గుర్తించారు. సుదీర్ఘ గంటలపాటు కొనసాగే పని వేళల వల్ల ఉద్యోగుల్లో మానసిక సామర్థ్యం కుంటుపడుతున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని పరిశోధకులు స్పష్టం చేశారు.
Post A Comment: