beauty tips for teens, apurupa, teluguh, telugu, andam, arogyam, www.teluguh.com
- అందంగా కనిపించడానికి మీరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం ఆరోగ్యంగా లేకపోతే ఆ ప్రయత్నమంతా వృథానే. అందుకే రోజూ చర్మాన్ని తాజాగా ఉంచేల చూసుకోవాలి. రాత్రిళ్లు ముఖాన్ని మంచి క్లెన్సర్తో శుభ్రం చేసుకోవాలి. దానివల్ల మురికీ, జిడ్డూ పోతాయి. ఆ వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అప్పుడే చర్మం మృదువుగా మారుతుంది.
- మొటిమలతో ఇబ్బంది పడుతుంటే, సొంతంగా ప్రయోగాలు చేయకుండా నిపుణుల సలహా తీసుకోవడం చాల అవసరం. కొందరు అవి కనిపించకుండా మొటిమలున్న చో మందంగా ఫౌండేషన్ రాస్తారు. దానివల్ల టీనేజీలో ఉండే సహజ అందం తగ్గుతుంది. అందుకే కన్సీలర్ వాడి, తరాత ఏదయినా పౌడరు రాసుకోవాలి. కన్సీలర్ని కూడా కేవలం అద్దుకోవాలి.
- ఆకర్షణీయంగా కనిపించేందుకు మేకప్ అవసరమే. అయితే కాలేజీ వయసులో అది అతిగా ఉండకూడదు. మేకప్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అనుకున్నప్పుడు పెదాలకు కొద్దిగా లిప్ స్టిక్ రాసుకుంటే చాలు. ఒకవేళ డార్క్ లిపస్టిక్ వేసుకోవాలనుకుంటే ముఖానికి వేసుకునే మేకప్ తక్కువగా ఉండేల చూసుకోవాలి.
- ఫ్యాషన్లకు ప్రాధాన్యం ఇచ్చి డ్రయార్ లు, కర్లింగ్, ఫ్లాట్ ఐరన్లు వాడకపోవడమే మంచిది. అవి జట్టుకు హానిచేస్తాయి. జట్టుని సాధ్యమైనంత వరకూ తేమగా ఉంచుకుంటే చాలు, అందంగా కనిపిస్తుంది. ఒకవేళ జట్టు మరీ పొడిబరి కనిపిస్తుంటే, వారానికోసారి కండిషనింగ్ తప్పనిసరి. ఆలీవ్ నూనెను పావుకప్పు తీసుకుని గోరువెచ్చగా చేసి తలకు రాసుకోవాలి. అరగంట తర్వాత షాంపూతో కడిగేసుకోవాలి. ఈ చిన్న ప్రయత్నం జుట్టుకు మంచి పోషణనందిస్తుంది.
