fitness tips for teens, arogyam, apurupa, teluguh.
అమ్మాయిలు సన్నగా కనిపించాలనుకుంటురు. ఆ క్రమంలో తెలియకుండానే ఆహారం తీసుకునే విషయంలో పొరపాట్లు చేస్తారు. అలా కాకుండా ఈ చిన్ని చిన్న సలహాలు పాటించి అందంగా మరియు ఫిట్ గా ఉండండి.
- కాలేజీ వయసులో అమ్మాయిలు వ్యక్తిగత ఆరోగ్యంపైనా దృష్టిపెట్టాలి. ఎందుకంటే ఏళ్లు గడిచే కొద్దీ ఎముకల్లోని క్యాల్షియం తగ్గిపోతుంది. ఆ మార్పు కౌమారం నుంచే మొదలవుతుంది. అందుకే కెలరీలు, ఫ్యాట్ అని కాకుండా రోజుకో గ్లాసు పాలు తాగాలి. ఓ అరటిపండు తిన్నా మంచిదే.
- బరువు పెరుగుతున్నారా?దానికి కారణమేంటో గుర్తించండి. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి. స్నేహితులు ఎంత బలవంతం పెట్టినా ఫాస్ట్ ఫుడ్ పాయింట్ లకు వెళ్లకపోవడమే మంచిది. ద్రవ పదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి.
- అతిగా డైటింగ్ చేయడమూ మంచిది కాదు. కెలరీలు తగ్గడంపై దృష్టి పెడుతున్నామనుకుంటరు కానీ, దానివల్ల పోషకాలను కోల్పోతారు. అందంపైనా ప్రభావం పడుతుంది. నెలసరీ సరిగ్గా రాకపోవచ్చు. అందుకే తక్కువ కెలరీలున్న ఆహారాన్ని తీసుకుంటూనే బరువు తేగ్గల చూసుకోవాలి.
- వ్యాయామం చేయాలి కానీ అతిగా కాదు. శరీర బరువును బట్టి రోజుకు అరగంట నడిస్తే సరిపోతుంది. ఒక్కరూ వెళ్లడం విసుగనిపిస్తే, స్నేహితులతో కలిసి గ్రూప్ గా వెళ్ళవచ్చు.
