ముఖాన్ని కాంతిమంతంగా మార్చుకోవడం కోసం తరచూ బ్యూటీ పార్లర్లకు పరుగెత్తాల్సిన పని లేదు . వంటింట్లో దొరికే వస్తువులతో ప్రయత్నిస్తే ...
ముఖాన్ని కాంతిమంతంగా మార్చుకోవడం కోసం తరచూ బ్యూటీ పార్లర్లకు పరుగెత్తాల్సిన పని లేదు. వంటింట్లో దొరికే వస్తువులతో ప్రయత్నిస్తే చాలు.
- చర్మానికి కండిషనర్: ఒక టేబుల్ స్పూను తేనెకి, రెండు టీ స్పూన్ల మీగడని కలిపి ముఖానికీ, మెడకీ రాసుకుని కొన్ని నిమిషాల తరవాత కడిగేసుకోండి.
- క్లీనింగ్: పచ్చి పాలలో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకుంటే మురికి వదిలిపోతుంది. తరచూ చేస్తుంటే చర్మం నునుపు దేలుతుంది
- మాయిశ్చరైజర్: ఒక టీ స్పూను నారింజ రసం, ఒక టీ స్పూను నిమ్మరసం, ఒక కప్పు పెరుగు కలిపి పేస్టులా చేయండి. దీనిని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరవాత తడి టిష్యూతో తుడిచేసుకోండి. పొడి చర్మం తేమగా మారడంతో పాటు, చర్మ కాంతి కూడా పెరుగుతుంది.
- ప్రొటీన్ మాస్క్: టేబుల్ స్పూను మినప్పప్పునీ, ఐదారు బాదం పప్పుల్నీ రాత్రి నానబెట్టి ఉదయం వాటిని పేస్టులా చేసి ముఖానికి రాసుకోండి. గంట తరువాత కడిగేసుకుంటే చర్మానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
- సన్‌స్క్రీన్ లోషన్: కీరదోస రసం, గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి ఒక డబ్బాలో వేసి ఫ్రిజ్లో దాచుకోండి. ఇంట్లోంచి బయటికి వెళ్లడానికి అరగంట ముందు ఇది ముఖానికి రాసుకుంటే సన్‌స్క్రీన్ లోషన్‌లా పనిచేస్తుంది. దీనివల్ల ఎండ ప్రభావం ఎక్కువగా ఇబ్బంది కలిగించదు.
COMMENTS