మురుకులు (జంతికలు) కావలసినవి : బియ్యప్పిండి - 3 కప్పులు ; వేయించిన శనగపిండి - కప్పు ; వాము – టీ స్పూను ; కారం - 2 టీ స్పూ...
మురుకులు (జంతికలు) |
కావలసినవి: బియ్యప్పిండి - 3 కప్పులు; వేయించిన శనగపిండి - కప్పు ; వాము – టీ స్పూను; కారం - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; నూనె – తగినంత.
తయారి: ఒక పాత్రలో బియ్యప్పిండి, శనగపిండి, ఉప్పు, కారం, వాము వేసి కలపాలి. ఒకగిన్నెలో రెండు కప్పుల నీరు, రెండు టేబులైఉస్పూన్ల నూనె వేసి మరిగించి, ఆ నీటిని పిండిలో వేసి కలపాలి. అవసరమనుకుంటే కొద్దిగా చన్నీరు వేస్తూ పిండి మెత్తగా అయ్యేవరకు కలపాలి. పిండిని కొద్దికొద్దిగా తీసుకుని, మురుకుల గొట్టంలో ఉంచి, ఒక ప్లేట్ లాంటి దాని మీదగుండ్రంగా మురుకు ఆకారం వచ్చేలా తిప్పుతుండాలి. బాణలిలో నూనె పోసి కాగాక, వీటిని జాగ్రత్తగా నూనెలో వేసి, మంట తగ్గించి వేయించాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక తీసేయాలి.
COMMENTS