మసాలా ఆవకాయ కావలసినవి : మామిడికాయ ముక్కలు – కేజీ , నువ్వుల నూనె - పావు కేజీ , కారం - పావు కేజీ , అల్లం + వెల్లుల్లి ముద్ద – పావు ...
మసాలాఆవకాయ

తయారీ:
మామిడికాయ ముక్కలు శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి ఉండలు లేకుండా కలుపు కోవాలి. మామిడికాయ ముక్కలు జత చేయాలి.
మరోగిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి బాగా వేగిన తర్వాత దింపేయాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. చల్లారాక మామిడికాయ ముక్కలు, మసాలా పొడులు వేసి బాగా కలపాలి. శుభ్రమైన జాడీలోకి తీసుకోవాలి. ఈ ఆవకాయ మామూలు ఆవకాయ కంటె కాస్త ఘాటుగా ఉంటుంది.
COMMENTS