మాట్లాడటం... అంటే నోటి నుండి శబ్దం రావడం ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. మాట్లాడాలంటే స్వరపేటిక, పెదవులు, దవడలు, నాలుకఅన్నీ కలిసి పనిచేయాలి. కొంద...
మాట్లాడాలంటే స్వరపేటిక, పెదవులు, దవడలు, నాలుకఅన్నీ కలిసి పనిచేయాలి. కొందరు నత్తిగా మాట్లాడటానికి కారణం వారి స్వరపేటికలో వుండే లోపమే. నత్తిని వైద్యపరిభాషలో ‘డిస్ఫిమియా’ అంటారు. పదంలోని మొదటి అక్షరాన్ని రెండు, మూడు లేక అంత కంటే ఎక్కువసార్లు పలకటాన్ని ‘నత్తి’ అంటారు. నత్తిలో రెండురకాలు వున్నాయి. మొదటి అక్షరం రెండు మూడుసార్లు ఉచ్చరిం చడం ఒకరకం. అంటే మొదటి అక్షరం పలికేటప్పుడు ధ్వని గొంతులో అడ్డుకుంటుంది. రెండోరకంలో నాలుక, గొంతు, ముఖంలోని కండరాలు బిగుసుకుని, నోట్లోనుంచి మాట బయటకు రావడానికి ఇబ్బందిపడు తుంది. స్వరపేటిక గోడల పక్కన ‘స్వరపేటికా కోష్టం’ రెండు వైపులా వుండే ‘స్వర రజ్జువులు’సాగడంలో లోపం ఏర్పడితే నత్తి వచ్చే అవకాశాలు వుంటాయి. సాధారణంగా నత్తి నాలుగైదు ఏళ్ల వయసు లోపే వస్తుంది. స్ర్తీలలో కంటే పురుషులలో నత్తి వచ్చే అవకాశాలు ఎక్కువ.
COMMENTS