కావలసినవి : కొబ్బరి - ఒక చిప్ప , మామిడికాయ - 1 ( చిన్నది ) పచ్చిమిర్చి - 5, ఉప్పు - తగినంత పసుపు - చిటికెడు , ఇంగువ - కొద్దిగ...
కావలసినవి :
కొబ్బరి - ఒక చిప్ప, మామిడికాయ- 1 (చిన్నది)
పచ్చిమిర్చి - 5, ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు, ఇంగువ - కొద్దిగా
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి - 5, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను,
శనగపప్పు - టీ స్పూను, మినప్పప్పు- టీ స్పూను
తయారి
- కొబ్బరిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి.
- మామిడికాయ తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
- మిక్సీలో మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి.
- బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు,ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి.
- పచ్చడిని ఒక గిన్నెలోకి తీసి, పోపు, ఇంగువ జతచేసి అన్నంలోకి వడ్డించాలి.
COMMENTS