ప్రకృతి సిద్ధ ఔషధం వేప. ఇది చర్మ సంరక్షణకు ఎంతో మేలు చేస్తుంది. ఓ యాబై వరకు వేపాకుల్ని తీసుకుని రెండు లీటర్ల నీటిలో వేసి , అవి రంగు మారే వరక...
ప్రకృతి సిద్ధ ఔషధం వేప. ఇది చర్మ సంరక్షణకు ఎంతో మేలు చేస్తుంది. ఓ యాబై వరకు వేపాకుల్ని తీసుకుని రెండు లీటర్ల నీటిలో వేసి, అవి రంగు మారే వరకూ మరిగించాలి. ఆ నీటిని చల్లర్చి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ వేప నీళ్లని రోజూ వంద మి.లీ చొప్పున బెకట్ నీటిలో కలుపుకుని స్నానం చేయాలి. ఇల రోజూ చేస్తే, చర్మ ఇస్పెక్షన్లూ, మెటిమలూ, వైట్ హెడ్స్ లాంటివి రావు. ఈ నీళ్లని స్కిన్ టోనర్లగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ వేప నీటిలో దూదిని ముంచి దాంతో రాత్రి పడుకోబోయే ముందు ముఖాన్ని బాగా తుడుచుకుని పడుకోవాలి. ఇలా చేస్తే మెటిమలూ, మచ్చలూ, బ్లక్ హెడ్స్ లాంటివి రాకుండా ఉంటాయి. ఆ నీటితో తలకి స్నానం చేస్తే చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. కొంచెం నీటిలో పది వేపాకుల్నీ, కొన్ని నారింజ తొక్కల్నీ వేసి మరిగించాలి. చల్లరాక వాటిని పేస్టుల చేయాలి. వాటికి కొంచెం తేనె, పెరుగూ, సోయా పాలూ కలిపి ఆ ముద్దని ముఖానికి రాసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చర్మ సమస్యలు చాలా మటుకు తగ్గిపోతాయి.
COMMENTS