కావలసినవి : మామిడికాయ ముక్కలు - కిలో ; ఉప్పు - పావు కిలో , పసుపు - టేబుల్ , స్పూను ; కారం - 125 గ్రా ., ఎండుకొబ్బరి పొడి - పావు క...
కావలసినవి :
మామిడికాయ ముక్కలు - కిలో; ఉప్పు - పావు కిలో, పసుపు - టేబుల్, స్పూను; కారం - 125 గ్రా., ఎండుకొబ్బరి పొడి - పావు కిలో; ఆవ పొడి - 50 గ్రా., జీలకర్ర పొడి - 25 గ్రా.; మెంతి పొడి - టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - పావు కిలో నువ్వుల నూనె - పావు కేజీ కంటె కొద్దిగా ఎక్కువ; ఇంగువ - టీ స్పూను, జీలకర్ర , మెంతులు - టీ స్పూనుతయారీ :
మామిడికాయ ముక్కలను తగినంత పరిమాణంలో కట్ చేసి లోపలి జీడి తీసేసి తుడిచి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పసుపు, కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఎండుకొబ్బరి పొడి, ఆవ పొడి, ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. వేరే గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. జీలకర్ర, మెంతులు వేసి వేగిన తర్వాత దింపేయాలి. నూనె చల్లారాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మసాలా పొడులు, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి జాడీలోకితీసుకోవాలి. మూడు నాలుగు రోజుల తర్వాత మరోసారి కలిపి వాడుకోవాలి.
COMMENTS