telugu jokes, apurupa jokes, teluguh, teluguh.com, jokes in telugu, fun, fun in telugu, hasyam, comedy jokes, cartoons
బంటి నీకు అన్ని పరీక్షలలో "౦" (సున్నా) మార్కులు వస్తున్నాయి కదా, మీ నాన్నా కొట్టటం లేదా?
బంటి:ఎందుకు లేదు, మా నాన్నా కొట్టేడానికి చేయి ఎత్తినప్పుడల్లా "జనగణ మన" అని పాడుతున్నాను. దానితో మా నాన్నా నిలబడిపోతున్నాడు. నేను అక్కడినుండి పరుగెత్తిపోతున్నాను, అని చెప్పాడు బంటి చింటుతో.
హహహహహహః .....................................................!
<><><><><><><><><><><><><><><><><><><><><><>
రాము: నా రాత చూసి మా మాష్టారు తెగ మెచ్చుకున్నాడు నాన్నా
నాన్నా: ఇంతకీ ఏమని?
రాము: పెద్దయ్యాక డాక్టర్ అవుతానని ...............!
<><><><><><><><><><><><><><><><><><><><><><>
చింటు:(బంటూతో): ఏరా!నీకు అన్నీ సబ్జెక్టులలో సున్నా మార్కులే వస్తాయి ఎందుకు? మీ నాన్నా ఏమి చేస్తుంటాడు?
బంటు:మా నాన్నా కోడి గ్రుడ్ల వ్యాపారం చేస్తుంటాడు!ఆఆఆ.................
<><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><>
(జడ్జి దొంగతో)
జడ్జి : నువ్వు దొంగతనం చేసినప్పుడు CC కెమెరాలో రికార్డయింది తెలుసా ?
దొంగ : అయితే చూపించండి .
జడ్జి : చూశావుగా మరి నీవేమైనా చెప్పాలనుకుంటున్నావా?
దొంగ : చూశారుగా నా పర్ఫామేన్స్ . నచ్చితే DTA Donga అని టైప్ చేసి 65656 కి S M S చేయండి. Please Vote for me(దయచేసి నాకు ఓటు వేయండి)
<><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><>
అప్పారావు (భార్యతో అంటున్నాడు): దేవుడు నీకు రెండు కళ్ళు ఇచ్చాడుగా అన్నంలో రాళ్ళు లేకుండా ఏరలేవా?
మణి (భర్తతో): దేవుడు మీకు కూడా 32 పళ్ళు ఇచ్చాడుగా . ఆ మాత్రం నమలలేరా.........!
<><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><>
బాబురావు: ఇప్పటికే ఆరు ఐస్ క్రీములు తెచ్చుకుని తిన్నావ్? పెళ్ళివారు ఏమనుకుంటారే?
అమ్ములు: నా గురుంచేమనుకోరు. ప్రతిసారీ మీకని చెప్పే తెస్తున్నాను! ఆ.........
<><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><>
వాస్తవానికి, భ్రమకి గల తేడా?
టీచర్: వాస్తవానికి, భ్రమకు ఒక ఉదాహరణ చెప్పరా సోము?
సోము: మీరు చెప్పడం వాస్తవం, మేము విన్నామనుకోవడం భ్రమ!
<><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><>
చీకటి యుగం ?
అప్పారావు: ఒరేయ్ సుబ్బారావు! మధ్యయుగాన్ని చీకటి యుగం అని కూడా పిలుస్తారెందుకు?
సుబ్బారావు: అప్పుడు కరెంటు లేదు కదరా.............!
<><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><>
అరటి పండు
టీచర్: బాలు! అరటి పండు గురించి చెప్పు?
బాలు: తింటే బలపడతాం. తొక్కితే జారిపడతాం టీచర్!
<><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><>
సోము: మా టీచర్ కి దైవభక్తి ఎక్కువ తెలుసా?
నాన్నా: నేను ఏ సమాధానం చెప్పినా 'ఓ మై గాడ్' అంటుంది నాన్నా...........!
<><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><>
పోస్టుమాన్: ఈ పార్సిల్ ఇవ్వడానికి 4 కిలో మీటర్ల దూరం నుంచి శ్రమపడి వస్తున్నాను తెలుసా?
అప్పారావు: అంత శ్రమెందుకు? పోస్ట్ చేస్తే సరిపోయేదిగా......................!
<><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><>
అప్పారావు: ఇలా మనం పార్కులో కబుర్లు చెబుతూ ఈ చిప్స్ తింటుంటే నీకే మనిపిస్తోంది?
చింతామణి: నువ్వే ఎక్కువ తింటున్నావనిపిస్తోంది!
<><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><>
నాన్నా: ఏంట్రా! మదర్ టంగ్ అన్న చోట 'లేదు' అని రాశావు?
రాజు: నువ్వేగా నాన్నా 'మీ అమ్మకు బొత్తిగా నోట్లో నాలుక లేదు' అంటుంటావు.........!
<><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><>
చింతామణి: ఏమండీ పక్కింటి చింటు కి లెక్కల్లో 99 మార్కులొచ్చాయి తెలుసా?
చింతారావు: అవునా! ఆ ఒక్క మార్కు ఎక్కడికి పోయినట్తో?
చింతామణి: మన అబ్బాయికి వచ్చిందిగా!
<><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><>
డాక్టర్ : బిల్లు పేషంట్ చేతికి మాత్రం ఇవ్వకండి.
నర్సు: ఎందుకు డాక్టర్ ?
డాక్టర్ : ఇప్పటికే అతనికి రెండు సార్లు గుండెపోటు వచ్చింది .................!
<><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><>
నాన్నా: మీ స్కూల్లో నీ జ్ఞాపకశక్తి కి మెచ్చి ఇచ్చిన బహుమతి ఏది?
చింటు: ఎక్కడ పెట్టానో మర్చిపోయాను నాన్నా!
COMMENTS